logo

ప్రముఖ బిల్డర్‌పై కేసు

బ్యాంకులో తాకట్టు ఉన్నప్పటికీ ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయించి సొమ్ము చేసుకున్న బిల్డర్‌పై కేసు నమోదైంది. తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌ సీఐ బీవీ శివప్రసాద్‌ రెడ్డి వివరాల మేరకు.. ‘తిరుపతి డీబీఆర్‌ ఆసుపత్రి రోడ్డులో రాకేష్‌ బిల్డర్స్‌ అధినేత కొమ్ము చెంచయ్య యాదవ్‌ ఓ అపార్టుమెంట్‌ నిర్మిస్తున్నారు. సిటీ యూనియన్‌ బ్యాంకులో

Published : 24 Jan 2022 05:01 IST

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: బ్యాంకులో తాకట్టు ఉన్నప్పటికీ ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయించి సొమ్ము చేసుకున్న బిల్డర్‌పై కేసు నమోదైంది. తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌ సీఐ బీవీ శివప్రసాద్‌ రెడ్డి వివరాల మేరకు.. ‘తిరుపతి డీబీఆర్‌ ఆసుపత్రి రోడ్డులో రాకేష్‌ బిల్డర్స్‌ అధినేత కొమ్ము చెంచయ్య యాదవ్‌ ఓ అపార్టుమెంట్‌ నిర్మిస్తున్నారు. సిటీ యూనియన్‌ బ్యాంకులో రూ.8.50 కోట్లు మార్ట్‌గేజ్‌ రుణం తీసుకుని 24 ప్లాట్ల నిర్మాణం చేపట్టారు. అందులో 13 ప్లాట్లను నగరంలోని విశ్రాంత ఉద్యోగులు, ప్రముఖులకు విక్రయించి సుమారు రూ.6.5 కోట్లు వరకు వసూలు చేశారు. తాకట్టులో ఉన్నప్పటికీ ఈసీలో పొందుపరచకుండా కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్‌ చేసిచ్చారు. రుణం చెల్లించకనే తాకట్టులో ఉన్న ఆస్తిని విక్రయించడంపై.. బ్యాంకు యాజమాన్యం స్పందిస్తూ అపార్టుమెంటు వేలం వేస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది. దీంతో కొనుగోలుదారులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న’ట్లు సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని