logo

నాణ్యతతో కూడిన బోధనకు ప్రాధాన్యం

జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో నాణ్యతతో కూడిన విద్యాబోధనకు అధిక ప్రాధాన్యం ఇస్తానని నూతన డీఈవోగా శేఖర్‌ స్పష్టం చేశారు. డీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. జిల్లాపై తనకు పట్టు ఉందని.. కార్వేటినగరం డైట్‌ కళాశాలలో అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్‌గా, పుత్తూరు డీవైఈవోగా

Published : 24 Jan 2022 05:01 IST

‘న్యూస్‌టుడే’తో నూతన డీఈవో శేఖర్‌

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో నాణ్యతతో కూడిన విద్యాబోధనకు అధిక ప్రాధాన్యం ఇస్తానని నూతన డీఈవోగా శేఖర్‌ స్పష్టం చేశారు. డీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. జిల్లాపై తనకు పట్టు ఉందని.. కార్వేటినగరం డైట్‌ కళాశాలలో అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్‌గా, పుత్తూరు డీవైఈవోగా పనిచేసిన అనుభవం ఉందని వెల్లడించారు. పాఠశాలల్లో పర్యవేక్షణ లోపం ఉన్నట్లు గమనించినట్లు చెప్పారు. జిల్లాలో పాఠశాల విద్యావ్యవస్థలో తనదైన శైలిలో ముద్ర వేస్తానని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందజేయడమే ప్రథమ కర్తవ్యంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు భావించాలని సూచించారు. పాఠశాలలపై ఉప, మండల విద్యాశాఖాధికారులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా పర్యవేక్షణ ఉండాలని ఆదేశించనున్నట్లు చెప్పారు. రోజూ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నాణ్యతతో కూడిన బోధన అందజేసినప్పుడే విద్యార్థుల నుంచి సామర్థ్యాలను ఆశించవచ్చని స్పష్టం చేశారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందజేయడం, కొవిడ్‌ నిబంధనలు పాఠశాలలో పాటించేలా ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. కలెక్టర్‌ హరినారాయణన్‌, జేసీ(అభివృద్ధి) శ్రీధర్‌ ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అమలయ్యేలా చూస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని