logo

సంచార పశు వైద్యశాలలతో సేవలు

పాడిరైతులకు అండగా పశువుల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి జగన్‌ వినూత్నంగా ఆలోచించి సంచార పశు వైద్యశాలలను అందుబాటులోకి తెచ్చారని మంత్రి ఆర్‌.కె.రోజా పేర్కొన్నారు. నగరిలో సంచార పశు వైద్యశాల వాహనాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు.

Published : 24 May 2022 05:29 IST


వాహనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ఆర్‌.కె.రోజా

నగరి, న్యూస్‌టుడే: పాడిరైతులకు అండగా పశువుల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి జగన్‌ వినూత్నంగా ఆలోచించి సంచార పశు వైద్యశాలలను అందుబాటులోకి తెచ్చారని మంత్రి ఆర్‌.కె.రోజా పేర్కొన్నారు. నగరిలో సంచార పశు వైద్యశాల వాహనాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.278 కోట్ల వ్యయంతో 340 వాహనాలను సమకూర్చాలన్నది లక్ష్యమని, మొదటి విడతగా ప్రస్తుతం సగానికి పైగా వాహనాలు ప్రారంభించారన్నారు. టోల్‌ఫ్రీ నంబరు 1962కు డయల్‌ చేస్తే, రైతు తన మండలంతో సహా పూర్తి వివరాలు తెలిపితే, సమీపంలోని రైతు భరోసా కేంద్రం నుంచి రైతులకు సంచార వాహనాల సేవలు అందుతాయన్నారు. పెంపుడు జంతువులు, పక్షులకు కూడా సేవలు అందిస్తారని వివరించారు. ఆర్డీవో సుజన, పశుసంవర్ధకశాఖ డీడీ చంద్రశేఖర్‌గౌడ్‌, ఏడీ కస్తూరి, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, ఎంపీపీ భార్గవి, రెడ్డి సంక్షేమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చంద్రశేఖరరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ వెంకటరత్నంరెడ్డి, బాలన్‌, వైస్‌ ఎంపీపీలు, కౌన్సిలర్లు, వైకాపా పట్టణ అధ్యక్షుడు అయ్యప్పన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని