logo

పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణాల్ని ప్రారంభించాలి

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 9,377 గృహ నిర్మాణాల్ని వెంటనే ప్రారంభమయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. గృహ నిర్మాణాల ప్రగతిపై సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.

Published : 24 May 2022 05:29 IST


మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు(జిల్లా సచివాలయం), న్యూస్‌టుడే: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 9,377 గృహ నిర్మాణాల్ని వెంటనే ప్రారంభమయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. గృహ నిర్మాణాల ప్రగతిపై సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాకు మంజూరైన 72,272 గృహాల్లో 51,594 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్‌ జరగని వాటిని నమోదుచేసి, నిర్మాణాల్ని ప్రారంభించేలా అవగాహన కల్పించాలన్నారు. సచివాలయాల వారీగా ప్రారంభానికి నోచుకోని గృహాల వివరాలతోపాటు ఇసుక, ఇటుకల లభ్యతపై సమీక్షించారు. ● సమగ్ర భూసర్వేలో భాగంగా గ్రామాల్లో డ్రోన్‌ సర్వేను నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తిచేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. డ్రోన్‌ సర్వే తర్వాత ఓఆర్‌ఐ షీట్ల తయారీ తర్వాత గ్రౌండ్‌ ట్రూథింగ్‌ చేయాలన్నారు. 118 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే ప్రారంభం కాగా.. 31 గ్రామాల్లో ఓఆర్‌ఐ షీట్లు వచ్చినట్లు చెప్పారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో నోటిఫికేషన్‌-13ను వెలువరించాలని సూచించారు. ● ఉపాధి పనుల్లో భాగంగా ప్రతి పంచాయతీ పరిధిలో వంద మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో జిల్లా సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడారు. రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి చెరువులు, సప్లై ఛానల్స్‌ వద్ద ఆక్రమణల్ని తొలగిస్తూ పనులు పూర్తి చేయాలన్నారు. స్పందన అర్జీలు సకాలంలో పరిష్కరించాలని, గృహ నిర్మాణాల నిమిత్తం రుణాల మంజూరు వేగవంతం చేయాలని సూచించారు. ఓటీఎస్‌, భూ రికార్డుల స్వచ్ఛీకరణ పనులపై ప్రగతి సాధించాలని పేర్కొన్నారు. జేసీ వెంకటేశ్వర్‌, డీఆర్‌వో రాజశేఖర్‌, డ్వామా పీడీ చంద్రశేఖర్‌, జిల్లా సర్వే శాఖ ఇన్‌స్పెక్టర్‌ లత, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, గృహనిర్మాణ సంస్థ పీడీ పద్మనాభం ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని