logo

ఏకైక రాజధాని అమరావతి: సీఎం రమేష్‌

రాష్ట్రంలో మూడు రాజధానులు ఒక మాయ మాత్రమే అని అది ఎప్పటికీ జరగదని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌ తెలిపారు. శ్రీకాళహస్తి మండలంలోని వాంపల్లెలో ఆదివారం నిర్వహించిన భాజపా ప్రజా పోరుయాత్రకు ఆయన హాజరైయ్యారు.

Updated : 03 Oct 2022 06:02 IST

మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌

శ్రీకాళహస్తిగ్రామీణం (ఏర్పేడు): రాష్ట్రంలో మూడు రాజధానులు ఒక మాయ మాత్రమే అని అది ఎప్పటికీ జరగదని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌ తెలిపారు. శ్రీకాళహస్తి మండలంలోని వాంపల్లెలో ఆదివారం నిర్వహించిన భాజపా ప్రజా పోరుయాత్రకు ఆయన హాజరైయ్యారు. ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేయగా వైకాపా అధికారంలోకి రాగానే జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎప్పటికీ ఆంధ్రుల రాజధాని అమరావతి మాత్రమేనని దీనికి భాజపా నిత్యం కట్టుబడి ఉంటుందన్నారు. రాజధాని కోసం రైతులు చేస్తున్న పాదయాత్రకు రక్షణ లేదని ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతుండటం దారుణమన్నారు. శాంతి భద్రతలు పరిరక్షించలేని పాలకులు ఈ రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. భాజపా తమకు అండగా ఉందని వైకాపా దొంగచాటున బయట చెబుతూ అవినీతికి పాల్పడుతుందన్నారు. వైకాపా చేస్తున్న అవినీతి అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఎజెన్సీల ఆధ్వర్యంలో విచారణ చేపట్టి దోచుకున్న సొమ్మును ప్రజలకు అందేలా చర్యలు చేపడుతుందన్నారు. రాష్ట్రంలో పోలీస్‌లు ఆ వ్యవస్థకే మచ్చతెచ్చేలా వ్యవహరిస్తున్నారని దీన్ని భాజపా చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్‌, జిల్లా అధ్యక్షులు దయాకర్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్‌, శివకుమార్‌, కిశోర్‌, రమేష్‌, ప్రసాద్‌, కృష్ణయ్య, మునస్వామిరెడ్డి, బొబ్బిలిరెడ్డి పలువురు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని