logo

2న కుప్పంలో ఉద్యోగ మేళా

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిసెంబరు 2న కుప్పంలోని ఎంఎఫ్‌సీ జూనియర్‌ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు.

Published : 29 Nov 2022 02:16 IST

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌ తదితరులు

చిత్తూరు కలెక్టరేట్‌: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిసెంబరు 2న కుప్పంలోని ఎంఎఫ్‌సీ జూనియర్‌ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. ఉద్యోగా మేళా కరపత్రాల్ని సోమవారం కలెక్టర్‌ ఆవిష్కరించారు.  ‌్ర  ఎంఈవోలు, ఇంజినీరింగ్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడుతూ నాడు-నేడు రెండో దశలో జిల్లాలోని 1,213 పాఠశాలల్లో రూ.425 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. రివాల్వింగ్‌ ఫండ్‌ త్వరగా ఖర్చు చేయాలని, పనుల నాణ్యతలో రాజీపడకూడదని ఆదేశించారు. 391 చోట్ల అదనపు తరగతి గదుల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. జేసీ వెంకటేశ్వర్‌, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, డీఈవో విజయేంద్రరావు పాల్గొన్నారు.‌్ర  కుప్పం, నగరి, పూతలపట్టు నియోజకవర్గాల్లో వెనుకబాటులో ఉన్నాయని, పనుల్లో పురోగతి సాధించాలని కలెక్టర్‌ అన్నారు. రూ.610 కోట్లతో జిల్లాలో 53 వేల గృహ నిర్మాణాలు జరుగుతున్నా యి. గత వారంలో లక్ష్యం రూ.7 కోట్లకు గాను రూ.5.40 కోట్ల వ్యయం జరిగిందన్నారు. నూతనంగా మంజూరైన గృహాల స్టేజ్‌ కన్వర్షన్‌ త్వరగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు. గృహ నిర్మాణ పీడీ పద్మనాభం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని