logo

జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించండి

ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడూ చిత్తూరు అభివృద్ధి జరగలేదని.. ప్రత్యేక జిల్లాగా ఏర్పడినా అభివృద్ధి శూన్యంగానే ఉందని చిత్తూరు స్మార్ట్‌ సీటీ డెవలప్‌మెంట్‌ సొసైటీ అధ్యక్షుడు తాండవమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 29 Jan 2023 04:45 IST

మాట్లాడుతున్న చిత్తూరు స్మార్ట్‌ సీటీ డెవలప్‌మెంట్‌ సొసైటీ అధ్యక్షుడు తాండవమూర్తి

చిత్తూరు గ్రామీణ: ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడూ చిత్తూరు అభివృద్ధి జరగలేదని.. ప్రత్యేక జిల్లాగా ఏర్పడినా అభివృద్ధి శూన్యంగానే ఉందని చిత్తూరు స్మార్ట్‌ సీటీ డెవలప్‌మెంట్‌ సొసైటీ అధ్యక్షుడు తాండవమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లాకు వందేళ్ల చరిత్ర ఉన్నా.. నగరం, పరిసర ప్రాంతాల అభివృద్ధిలో వెనుకబాటులో ఉందన్నారు. విశ్వవిద్యాలయం, పరిశ్రమలు, ఉపాధి కల్పన, వలసల నివారణపై నాయకులు చిత్తశుద్ధిగా శ్రమించలేదని ఆరోపించారు. నగర పాలక సంస్థగా ఏర్పాటైన తర్వాత అభివృద్ధిలో మాత్రం ఆ స్థాయి గుర్తింపు లేదన్నారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసులు అటువైపు దృష్టి సారించాలన్నారు. సొసైటీ కార్యదర్శి శివకుమార్‌, సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని