logo

అధికారంలోకి రాగానే డీఎస్పీ, సీఐపై విచారణ చేపడతాం

అక్రమ కేసులు పెడితే భయపడబోమని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అన్నారు. సోమవారం చిత్తూరులో నారా లోకేశ్‌ విడిది కేంద్రం వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ నాలుగు కేసులు పెట్టారన్నారు.

Published : 07 Feb 2023 01:42 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, ఎం.ఎస్‌.రాజు తదితరులు

చిత్తూరు(జిల్లా పంచాయతీ): అక్రమ కేసులు పెడితే భయపడబోమని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అన్నారు. సోమవారం చిత్తూరులో నారా లోకేశ్‌ విడిది కేంద్రం వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ నాలుగు కేసులు పెట్టారన్నారు. లోకేశ్‌, అచ్చెన్నాయుడు, అమరనాథరెడ్డి, నాని, తనపై కేసులు నమోదు చేశారని, పోలీసులే ఫిర్యాదుదారులుగా కేసులు పెట్టారని, సుప్రీంకోర్టు పోలీసులు ఫిర్యాదుదారులుగా ఉండరాదని తీర్పునిచ్చిందన్నారు. వాస్తవాలు గ్రహించిన న్యాయస్థానం వారికి బెయిలు మంజూరు చేసిందన్నారు. వైకాపాకు తొత్తులుగా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న డీఎస్పీ, సీఐపై తెదేపా అధికారంలోకి రాగానే న్యాయ విచారణ చేయించి కఠిన చర్యలు చేపడతామన్నారు. పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.రాజు మాట్లాడుతూ పాదయాత్రలో లోకేశ్‌తో కరచాలనం చేసిన ఆర్టీసీ డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలగించడం దారుణమన్నారు. వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్‌, రాష్ట్ర కార్యదర్శి సందీప్‌, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షడు ప్రకాష్‌నాయుడు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని