logo

విద్యుత్తు దాడుల్లో 660 కేసులు

విద్యుత్తు చౌర్యంపై ఎస్‌పీడీసీఎల్‌ తిరుపతి సర్కిల్‌ పరిధిలో బుధవారం రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుత్తు శాఖ అధికారుల దాడులు నిర్వహించారు.

Updated : 30 Mar 2023 03:30 IST

రూ.13.73లక్షల జరిమానా

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: విద్యుత్తు చౌర్యంపై ఎస్‌పీడీసీఎల్‌ తిరుపతి సర్కిల్‌ పరిధిలో బుధవారం రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుత్తు శాఖ అధికారుల దాడులు నిర్వహించారు. ఎనిమిది డివిజన్ల పరిధిలో 3427 సర్వీసులు తనిఖీలు చేపట్టగా.. అక్రమంగా విద్యుత్తు వాడకం, అధిక లోడు, మీటరు రీడింగ్‌లో అక్రమాలకు పాల్పడుతున్న 660 సర్వీసుదారులపై కేసులు నమోదు చేసి రూ.13.73 లక్షల జరిమానా విధించామని ఉమ్మడి జిల్లా ఎస్‌ఈ కృష్ణారెడ్డి తెలిపారు. డివిజన్ల వారీగా కేసుల నమోదు, జరిమానాలు ఇలా.. తిరుపతి అర్బన్‌ డివిజన్‌లో 85 సర్వీసులకు రూ.2.51 లక్షల జరిమానా విధించగా.. తిరుపతి రూరల్‌లో 56 సర్వీసులకు రూ.0.94 లక్షలు, పుత్తూరులో 84 సర్వీసులకు రూ.2.06లక్షలు, చిత్తూరు అర్బన్‌ డివిజన్‌లో 67 సర్వీసులకు రూ.1.60లక్షలు, చిత్తూరు రూరల్‌లో 106 సర్వీసులకు రూ.2.45 లక్షలు, మదనపల్లె డివిజన్‌లో 83 సర్వీసులకు రూ.1.74 లక్షలు, పీలేరులో 24 సర్వీసులకు రూ.0.69లక్షలు, పుంగనూరు డివిజన్‌లో 155 సర్వీసులకు రూ.1.76లక్షల జరిమానా విధించామని ఎస్‌ఈ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని