logo

కాఫీపొడితో భారీ అంబేడ్కర్‌ చిత్రం

తిరుపతి కలెక్టరేట్‌ ఆవరణలో సూక్ష్మ కళాకారుడు పల్లి చిరంజీవి సుమారు 70 కిలోల కాఫీపొడితో 132 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు ఉన్న కాటన్‌ వస్త్రంపై డాక్టర్‌ అంబేడ్కర్‌ చిత్రాన్ని వేస్తున్నారు.

Published : 31 Mar 2023 02:33 IST

ఈనాడు, తిరుపతి: తిరుపతి కలెక్టరేట్‌ ఆవరణలో సూక్ష్మ కళాకారుడు పల్లి చిరంజీవి సుమారు 70 కిలోల కాఫీపొడితో 132 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు ఉన్న కాటన్‌ వస్త్రంపై డాక్టర్‌ అంబేడ్కర్‌ చిత్రాన్ని వేస్తున్నారు. అంబేడ్కర్‌ 132 జయంతిని పురస్కరించుకుని 132 అడుగుల పొడవున్న చిత్రాన్ని ఈ నెల 18న ప్రారంభించారు. 20 రోజుల్లో పూర్తి చేసేలా కష్టపడుతున్నారు. ఏప్రిల్‌ 14న దిల్లీ ఏపీ భవన్‌లో తెలుగు సంఘం ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని