logo

కష్టం.. వడగళ్లతో నష్టం

ఇటీవల మండలంలో కురిసిన వడగళ్ల వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. తిరుమలరాజుపురం, శ్రీకావేరిరాజుపురం సీయంకండ్రిగ గ్రామాల్లోని పూల రైతులపై వరుణుడు ప్రతాపం చూపాడు.

Updated : 01 Apr 2023 05:38 IST

పశువులకు మేతగా పూలతోటలు

ఇటీవల మండలంలో కురిసిన వడగళ్ల వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. తిరుమలరాజుపురం, శ్రీకావేరిరాజుపురం సీయంకండ్రిగ గ్రామాల్లోని పూల రైతులపై వరుణుడు ప్రతాపం చూపాడు. దీంతో చామంతి, ముద్దబంతి పూల తోటలకు పూర్తిగా నష్టం వాటిల్లింది. తిరుమలరాజుపురం గ్రామానికి చెందిన రైతు వేలురెడ్డి తన పొలంలో ఒకటిన్నర ఎకరం పొలంలో రూ.60 వేలు ఖర్చు చేసి చామంతి పూల సాగు చేశారు. కిలో రూ.200 ధరలు పలికే సమయానికి వడగళ్ల వర్షం కురవడంతో పంట పూర్తిగా దెబ్బతింది. రూ.లక్షకుపైగా వచ్చే లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. కంటిమీద కునుకు లేకుండా కాపాడిన తోటను చేసేది ఏమీ లేక పశువులకు మేతగా వదిలేశానని వాపోయారు.

న్యూస్‌టుడే, పాలసముద్రం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని