logo

కోస్తే రూ.15.. రాలితే రూ.5

జిల్లాలో మామిడి అత్యధికంగా సాగు చేస్తారు. అందులో పులిచెర్ల మండలంలో 11 వేల ఎకరాల్లో సాగువుతోంది. ఈ ఏడాది అరకొర దిగుబడితో రైతులు ఇబ్బందులు పడుతుండగా..

Published : 27 May 2023 03:23 IST

ఈదురు గాలులకు నష్టపోయిన మామిడి రైతులు

కాయలు ఏరుతున్న కూలీలు

జిల్లాలో మామిడి అత్యధికంగా సాగు చేస్తారు. అందులో పులిచెర్ల మండలంలో 11 వేల ఎకరాల్లో సాగువుతోంది. ఈ ఏడాది అరకొర దిగుబడితో రైతులు ఇబ్బందులు పడుతుండగా.. అకాల వర్షం, ఈదురు గాలులు రైతులను నష్టాల్లోకి నెట్టాయి. పులిచెర్ల మండలం జ్యోతినగర్‌ వద్ద గురువారం సాయంత్రం వీచిన గాలులకు మామిడి కాయలు నేలరాలాయి. రైతు రెడ్డి ప్రకాష్‌కు చెందిన 19 ఎకరాల్లో 1050 మామిడి చెట్లు ఉండగా అందులో గురువారం వీచిన గాలివానకు 20 చెట్లు నేలకూలాయి. దాదాపు 15-17 టన్నుల వరకు కాయలు నేలరాలి రూ.2.5 నుంచి రూ.3 లక్షల వరకు నష్టం వచ్చిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కాయలు కోసి మార్కెట్‌లో అమ్మితే కిలో రూ.15 వస్తుందని.. గాలికి నేలరాలిన కాయలు అమ్మితే రూ.4-రూ.5 వరకు ఇస్తున్నారని తెలిపారు. ఇలా 5-6 టన్నులు మామిడి నేల రాలిన రైతుల్లో మునీర్‌ఖాన్‌, ప్రభాకర్‌, శ్రీరాములు కోదండయ్య, చెండ్రాయులు, ధనుంజయ్య, పోకల చంద్ర, సుబ్రమణ్యం ఉన్నారు. మండలంలోని అయ్యవాండ్లపల్లి, ఎర్రవాండ్లపల్లి, ఆవుల పెద్దిగారిపల్లె, గౌరిశెట్టివారిపల్లే, జ్యోతినగర్‌, దిన్నె బెస్తపల్లే గ్రామాల్లో అపార నష్టం వాటిల్లింది.

ఈనాడు, చిత్తూరు, న్యూస్‌టుడే, కల్లూరు

రాలిన కాయలు ట్రాక్టర్‌లో పోస్తున్న కూలీలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని