logo

RK Roja: మంత్రి రోజాపై వైకాపా కౌన్సిలర్ తీవ్ర విమర్శలు

వైకాపా మంత్రి రోజాపై అదే పార్టీకి చెందిన పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్‌ భువనేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు.

Published : 23 Jan 2024 15:03 IST

తిరుపతి: వైకాపా మంత్రి రోజాపై అదే పార్టీకి చెందిన పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్‌ భువనేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. పుత్తూరు మున్సిపల్‌ ఛైర్మన్ పదవి కోసం డబ్బు డిమాండ్ చేశారని ఆరోపించారు. రూ. 70 లక్షలు డిమాండ్ చేయగా.. రూ.40 లక్షలు ఇచ్చినట్లు ఆమె చెప్పారు. మంత్రి సోదరుడు కుమారస్వామిరెడ్డి పంపించిన వ్యక్తికి 3 విడతల్లో రూ.40 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఛైర్మన్‌ పదవి ఇవ్వకపోగా.. డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని ఆరోపిస్తూ భువనేశ్వరి వీడియో విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని