logo

అల్పాదాయాల్లోనే.. స్వయం సహాయక సంఘాలు

గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను వైకాపా సర్కార్‌ ఉపయోగించుకోవడం లేదు. 80 శాతం రాయితీతో స్వయం సహాయ సంఘాలకు ఇచ్చే రుణం సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు.

Published : 29 Mar 2024 02:50 IST

కేంద్రం ముందుకొస్తున్నా పట్టించుకోని జగన్‌
డ్రోన్‌ దీదీలో అవకాశం కొందరికే

గూడూరు, పలమనేరు, న్యూస్‌టుడే: గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను వైకాపా సర్కార్‌ ఉపయోగించుకోవడం లేదు. 80 శాతం రాయితీతో స్వయం సహాయ సంఘాలకు ఇచ్చే రుణం సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు. దీన్‌దయాల్‌ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ పేదిరిక నిర్మూలన(ఎన్‌ఆర్‌ఎల్‌ఎమ్‌) కార్యక్రమాల్లో వెనుకబాటు కన్పిస్తోంది. కేంద్రం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను లక్షాధికారులను చేయాలన్న సంకల్పంతో అనేక పథకాలు తెచ్చినా వాటిని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. డ్రోన్‌ దీదీ కార్యక్రమం ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 2 కోట్ల కుటుంబాలను లక్షాధికారులను చేయాలిన ప్రణాళిక రూపొందించింది. ఇందుకు ఐదేళ్లు ప్రణాళిక చేసింది. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టింది. అటు రాయితీతోపాటు రుణ సాయానికి బ్యాంకు సహకారం ఇప్పించింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించలేక పోయింది.డ్రోన్‌ దీదీ పథకంలో రూ.10 లక్షల యూనిట్‌ విలువ కాగా 20శాతం సంఘాలు, 80శాతం రుణం ఇస్తోంది. నిర్వహణ భారం ఎరువులు, రసాయన తయారీ సంస్థలు భరించాలి. స్వయం సహాయ సంఘాలను భాగస్వామ్యం చేసి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్రం తెచ్చిన ఈ పథకంలో జిల్లా వాసులకు ఆశించిన ప్రయోజనం దక్కలేదు.

దక్కని ప్రయోజనం: కిసాన్‌ డ్రోన్‌ కార్యక్రమాన్ని మోదీ 2022 ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఇందుకు ప్రతి మండలం నుంచి మహిళా సంఘాలను ఎంపిక చేయాల్సి ఉండగా.. యువతను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దీంతో జాప్యం చోటు చేసుకుంది. మార్చిలో డ్రోన్‌లు అందజేసినా కొందరికే దక్కాయి.


ఉమ్మడి జిల్లాలో నలుగురికే అవకాశం

తాజాగా ప్రకటించి డ్రోన్‌ దీదీలో నలుగురు మాత్రమే శిక్షణ తీసుకుని యూనిట్‌ పొందారు. వీరికి రాయితీతో రుణం అందజేయగా డ్రోన్‌ల ద్వారా వ్యవసాయంలో మందులు పిచికారీ చేయడం ద్వారా ఆర్థిక స్వావలంభనకు అవకాశం ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని