logo

రెండో రోజు 16 నామినేషన్లు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్‌ తెలిపారు.

Published : 20 Apr 2024 04:05 IST

 రిటర్నింగ్‌ అధికారి షన్మోహన్‌కు నామినేషన్‌ పత్రాన్ని అందిస్తున్న వైకాపా చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప
చిత్తూరు కలెక్టరేట్‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్‌ తెలిపారు. చిత్తూరు ఎంపీ స్థానానికి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. పుంగనూరు అసెంబ్లీకి ఇద్దరు, నగరి ఇద్దరు, జీడీనెల్లూరు ఇద్దరు, పూతలపట్టు ఇద్దరు, పలమనేరు నలుగురు, కుప్పం నియోజకవర్గానికి ఒక నామినేషన్‌ దాఖలయ్యాయి. రెండో రోజున చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్లు దాఖలు కాలేదు.

ఎంపీ స్థానానికి ఐదు..: చిత్తూరు ఎంపీ స్థానానికి ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. ఆర్వో షన్మోహన్‌కు అభ్యర్థులు తమ నామపత్రాల్ని సమర్పించారు. వైకాపా అభ్యర్థిగా రెడ్డెప్ప రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీ వెంట జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు ఉన్నారు. రెడ్డెప్ప సతీమణి రెడ్డెమ్మ సైతం వైకాపా తరఫున రెండు సెట్ల నామినేషన్లు సమర్పించారు. జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి దుగ్గిరాల నాగేశ్వరరావు తన నామినేషన్‌ అందజేశారు. చిత్తూరు ఎమ్మెల్యే స్థానానికి శుక్రవారం నామినేషన్లు దాఖలు కాలేదు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని