logo

అధ్వానంగా సంక్షేమ హాస్టళ్లు: ఐవీ

సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌, కాస్మిటిక్‌ ఛార్జీలు పెంచాలని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు(ఐవీ) అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా ప్లీనరీ సమావేశాలు రెండోరోజు కచేరిపేట యూటీఎఫ్‌ హోంలో నిర్వహించారు.

Published : 03 Oct 2022 05:47 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు, వేదికపై ప్రతినిధులు

కాకినాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే: సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌, కాస్మిటిక్‌ ఛార్జీలు పెంచాలని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు(ఐవీ) అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా ప్లీనరీ సమావేశాలు రెండోరోజు కచేరిపేట యూటీఎఫ్‌ హోంలో నిర్వహించారు. తొలుత గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లకు నాడు-నేడు నిధులు కేటాయించాలన్నారు. సంక్షేమ ప్రభుత్వం అంటూ చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం హాస్టళ్లకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూ.. ప్రాథమిక నుంచి ఉన్నత విద్య వరకూ చదువును పేద విద్యార్థులకు దూరం చేస్తున్నారన్నారు. కాకినాడలోని ఎస్సీ కళాశాల హాస్టల్‌ స్లాబ్‌ కూలి ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడితే నేటికీ నూతన భవనంలోకి మార్చడానికి కృషి చేయకపోవడం దారుణమన్నారు. అంబేడ్కర్‌ విదేశీ విద్యా పథకం పేరు తొలగించి, జగనన్న విదేశీ విద్య పథకం పేరు మార్పు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్టీఆర్‌ యూనివర్సిటీ పేరు మార్చడం కంటే కొత్త యూనివర్సిటీ కట్టి పేర్లు పెట్టుకోవాలంటూ జగన్‌మోహనరెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.రాము, టి.రాజా, జిల్లా నాయకులు వరహాలు, మణికంఠ, శివరాజు, అరుణ్‌, రమ్య, లలిత, పావని తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని