logo

వరి నాట్లు ప్రారంభం

రబీ సీజన్‌కు సంబంధించి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు సాగునీరు విడుదల కావడంతో జిల్లాలో వరినాట్లు ఊపందుకుంటున్నాయి. రబీ సాగు పనుల్లో రైతన్నలు నిమగ్నమవుతున్నారు.

Updated : 02 Dec 2022 07:04 IST

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం):  రబీ సీజన్‌కు సంబంధించి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు సాగునీరు విడుదల కావడంతో జిల్లాలో వరినాట్లు ఊపందుకుంటున్నాయి. రబీ సాగు పనుల్లో రైతన్నలు నిమగ్నమవుతున్నారు. జిల్లా పరిధిలోని 18 మండలాల్లో 56 వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో వరిసాగు లక్ష్యం కాగా గురువారం నుంచి మూడు మండలాల్లో నాట్లు ప్రారంభమయ్యాయి. రాజానగరం, రాజమహేంద్రవరం గ్రామీణం, రంగంపేట మండలాల్లో 120 హెక్టార్లలో నాట్లు పడినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు చెప్పారు. రాజానగరం మండలం నరేంద్రపురం, రాజమహేంద్రవరం మండలం వెంకటనగరం, తొర్రేడులో వరినాట్లు వేసే కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బోసుబాబుతో కలిసి ఆయన పరిశీలించారు.  రాజమహేంద్రవరం సహాయ వ్యవసాయ సంచాలకుడు డి.శ్రీనివాసరెడ్డి, విస్తరణాధికారులు పాల్గొన్నారు.

36.83 శాతం ధాన్యం కొనుగోలు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): జిల్లాలోని 239 కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 36.83 శాతం ధాన్యం కొనుగోలు జరిగినట్లు జేసీ శ్రీధర్‌ గురువారం తెలిపారు. ఖరీఫ్‌ ధాన్యానికి సంబంధించి 2.85 మెట్రిక్‌ టన్నులు సేకరణ లక్ష్యంకాగా ఇప్పటికి మొత్తం రూ.206 కోట్ల విలువైన 1,04,974 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 18,605 మంది రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని