logo

నేటి నుంచి ఆరుద్ర ఆమరణ నిరాహార దీక్ష

తన బిడ్డ దుర్భర స్థితికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నేటినుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్లు కాకినాడ జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గం రాయుడుపాలానికి చెందిన ఆరుద్ర తెలిపారు.

Published : 29 May 2023 05:00 IST

మసీదుసెంటర్‌ (కాకినాడ), అమలాపురం కలెక్టరేట్‌: తన బిడ్డ దుర్భర స్థితికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నేటినుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్లు కాకినాడ జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గం రాయుడుపాలానికి చెందిన ఆరుద్ర తెలిపారు. దీనిపై ఆదివారం కాకినాడ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, త్రీటౌన్‌ సీఐ కృష్ణభగవాన్‌లను కలిసి దీక్షకు అనుమతి కోరుతూ వినతిపత్రమిచ్చారు. ఆస్తులు అమ్ముకోనీయకుండా కానిస్టేబుల్‌ మెరపల శివ, మంత్రి గన్‌మెన్‌ కన్నయ్య, టీచర్‌ ముత్యాలరావు, లాయర్‌ చిట్టిబాబులు ఇబ్బంది పెట్టారన్నారు. అమలాపురంలోని తమ స్థలాన్ని కొంతమంది ఆక్రమించే ఉద్దేశంతో తనను, తన కుమార్తెను చంపాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని వికలాంగుల సంఘంతో కలిసి కాకినాడ కలెక్టరేట్‌ ఎదుట తాను ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్లు వివరించారు. పోలీసులు ధర్నాచౌక్‌ వద్ద మాత్రమే దీక్ష చేసుకోవాలని చెప్పారు.

* ఆరుద్ర వేమగిరిలో నారా లోకేశ్‌ను కలిసినట్లు చెప్పారు. తమకు అండగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారన్నారు. నాయకులు చంద్రబాబు వద్దకు తీసుకువెళ్తానన్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని