అసంపూర్తి నిర్మాణం.. ఆపేయాలని ఆదేశం..!
రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలు, వెల్‌నెస్ సెంటర్లు, రైతుభరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, బల్క్‌మిల్క్ సెంటర్ల నిర్మాణాలు చేపట్టింది.
న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్
బోడసకుర్రులో అసంపూర్తిగా సచివాలయ భవనం
రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలు, వెల్‌నెస్ సెంటర్లు, రైతుభరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, బల్క్‌మిల్క్ సెంటర్ల నిర్మాణాలు చేపట్టింది. వీటిలో గ్రామ సచివాలయానికి రూ.40 లక్షలు, ఆర్‌బీకేకు రూ.21.80 లక్షలు, ఆరోగ్య ఉపకేంద్రాలకు రూ.17.50 లక్షలు చొప్పున కేటాయించింది. గుత్తేదారులు నిర్మాణాలు చేపట్టారు. కొన్నిచోట్ల అధికారులు గుత్తేదారులను బతిమాలి పనులు అప్పగించారు. ఇప్పటివరకు ఉన్నతాధికారులు ప్రభుత్వ భవనాలపై సమీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసి వాటి ద్వారా ప్రజలకు సేవలు దగ్గరచేయాలని చెప్పేవారు. తాజాగా పూర్తికాని వాటిని నిలిపివేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలియడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకీ నిర్ణయం..
జిల్లావ్యాప్తంగా మొదలు పెట్టని, పునాది దశ దాటని నిర్మాణాలను నిలిపివేయాలని పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలందాయి. దీంతో వారు మండలాలవారీగా నిర్మాణాల పురోగతిపై నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. భవనాలన్నింటికీ పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించలేకనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని గుత్తేదారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆరంభం నుంచీ స్థల సేకరణ, బిల్లుల మంజూరులో జాప్యంతోనే నిర్మాణాలు పూర్తికాని పరిస్థితి తలెత్తిందని గుత్తేదారులు అంటున్నారు. ఇప్పటి వరకు చేసిన పనులకు సంబంధించి బిల్లుల పరిస్థితేంటని వాపోతున్నారు.
అద్దె భవనాలే దిక్కు..
పాలన స్వరూపాన్నే మార్చేస్తామని, సేవలన్నింటినీ ప్రజల వద్దకే చేరుస్తామని చెప్పిన ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్మాణాల నిలిపివేత నిర్ణయం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పాత భవనాలు తొలగించినచోట్ల తాత్కాలికంగా అద్దె భవనాల్లో పలు శాఖల అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. తాజా ఆదేశాలతో అద్దె భవనాలే దిక్కయ్యేలా ఉన్నాయని అధికారులు వాపోతున్నారు. కొన్నిచోట్ల ఆర్‌బీకే, వెల్‌నెస్ సెంటర్లకు అద్దెలు చెల్లించక యజమానులు తాళాలువేసిన ఘటనలు ఉండడం గమనార్హం.
పునాదుల్లో 290 భవనాలు
జిల్లావ్యాప్తంగా సచివాలయాలు, ఆర్‌బీకేలు, వెల్‌నెస్ సెంటర్లు మొత్తం 1,110 భవనాలు నిర్మించాలని పనులు ప్రారంభించారు. వీటిలో 290 భవనాలు పునాది దశ దాటలేదు. పనులు నిలిచాయి. డిజిటల్ గ్రంథాలయాలు, బల్‌్్కమిల్క్ సెంటర్ల నిర్మాణం ఇప్పటికీ మొదలు పెట్టనేలేదు.
మార్చి నాటికి పూర్తి చేస్తాం
పంచాయతీల్లో సచివాలయాలు, ఆర్‌బీకేలు, ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల పునాది దశకే పరిమితం కావడంతో నిలిపివేయాలని ఆదేశాలందాయి. మిగిలిన భవనాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.
చంటిబాబు, ఎస్‌ఈ, పంచాయతీరాజ్ శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: చంద్రబాబు పిటిషన్లపై విచారణ ప్రారంభం
-
Siva Karthikeyan: శివ కార్తికేయన్ మూవీ.. మూడేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టనున్న దర్శకుడు..!
-
Vivo Y56: వివో వై56లో కొత్త వేరియంట్.. ధర, ఫీచర్లలో మార్పుందా?
-
Canada: అందరూ చూస్తున్నారు.. పోస్టర్లు తొలగించండి..: కెనడా హడావుడి
-
IND w Vs SL w: ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టుకు స్వర్ణం..
-
Indian Air Force: వాయుసేన చేతికి తొలి సీ-295 విమానం..!