logo

అడ్డగోలు ప్రచారం.. ట్యాబ్‌లే నిదర్శనం

ఎన్నికలు ముంచుకొస్తున్నా వైకాపా అడ్డదారి ప్రచారానికి మాత్రం అడ్డుకట్ట పడడంలేదు. విద్యార్థులనూ ఈ వ్యవహారంలో వినియోగించుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నా.. విద్యాశాఖ, ఎన్నికల సంఘం పరిస్థితిని చక్కదిద్దే చొరవ చూపడంలేదు.

Published : 17 Apr 2024 06:23 IST

పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన ట్యాబ్‌ ఆన్‌ చేయగానే జగన్‌ బొమ్మతో కూడిన నవరత్నాల లోగో

ఎన్నికలు ముంచుకొస్తున్నా వైకాపా అడ్డదారి ప్రచారానికి మాత్రం అడ్డుకట్ట పడడంలేదు. విద్యార్థులనూ ఈ వ్యవహారంలో వినియోగించుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నా.. విద్యాశాఖ, ఎన్నికల సంఘం పరిస్థితిని చక్కదిద్దే చొరవ చూపడంలేదు. వైకాపా ప్రభుత్వం బైజూస్‌ కంటెంట్‌తో ఎనిమిదో తరగతి నుంచి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించిన విషయం తెలిసిందే. వీటిని ఆన్‌ చేయగానే సీఎం జగన్‌ ఫొటోతో కూడిన నవరత్నాల లోగో వస్తోంది. ఇందులో జలయజ్ఞం, మద్యం నియంత్రణ, ఆరోగ్యశ్రీ, వైఎస్సార్‌ రైతు భరోసా, పేదలందరికీ ఇళ్లు, వైఎస్‌ఆర్‌ ఆసరా- చేయూత, పింఛను కానుక, అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల పేర్లు- చిత్రాలు దర్శనమిస్తున్నాయి. ఈ ట్యాబ్‌లపై జగన్‌ చిత్రం ఉన్న స్టిక్కర్లు నేటికీ ఉన్నాయి. వీటిని తొలగిస్తే ట్యాబ్‌లు వెనక్కి తీసుకుంటారేమోననే భయం పిల్లల్ని వెంటాడుతోంది. నవరత్నాల లోగోను ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం తొలగించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యల్లేవు. చిన్నదానికీ హడావుడి చేసి ఉపాధ్యాయులను బెదరగొట్టే పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌.. ట్యాబ్‌లలో వైకాపా ప్రభుత్వ ప్రచార లోగో  తొలగించకుండా స్వామిభక్తి చాటుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈనాడు, కాకినాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని