పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు.
ఆకట్టుకొంటున్న వినూత్నమైన శుభలేఖ
శ్యామలాసెంటర్, రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే:రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. వారి వివాహ వేడుక ఈ నెల 21న అన్నవరం క్షేత్రంలో జరగనుంది. ఇందుకోసం బంధుమిత్రులను ఆహ్వానించేందుకు ప్రచురించిన శుభలేఖ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. దీనికి కారణం నిశ్చితార్థం మొదలుకొని 16 రోజుల పండగ వరకు జరిగే సుమారు 45 ఘట్టాలను, వాటి విశిష్టతను 40 పేజీల శుభలేఖలో పొందుపరిచారు. వినాయకుని బియ్యం, ఆహ్వానపత్రిక, పందిరిరాట, పెండ్లికుమారుడు, కుమార్తెను చేయడం, స్నాతకము, కాశీయాత్ర, మధుపర్కం, భాషికములు, కన్యాదానం, షోడశదానములు, జీలకర్ర, బెల్లం, తలంబ్రాలు, బ్రహ్మబంధనం, అగ్నిసాక్షి, ఏడడుగుల బంధం, ఉంగరాల ఆట, అప్పగింతలు ఇలా అన్ని ఘట్టాలను అందులో పొందుపరిచారు. ప్రతి ఘట్టానికి ఒక క్యూఆర్ కోడ్ రూపొందించారు. కోడ్ను స్కాన్ చేస్తే ఆన్లైన్లో ఆ ఘట్టాన్ని ప్రతిఒక్కరూ వీక్షించేలా శుభలేఖను రూపొందించడం మరో విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.