logo

ఎంపీ మాధవ్‌ వ్యవహారంలో సీఎం ఎందుకు స్పందించరు?

ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంలో సీఎం జగన్‌ ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. గుంటూరులో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

Published : 13 Aug 2022 05:58 IST

మాజీ మంత్రి ఆనందబాబు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంలో సీఎం జగన్‌ ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. గుంటూరులో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ఎంపీ మాధవ్‌ దారిన పోయే దానయ్య కాదు ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరించడానికి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎంపీ ఆయన. మాధవ్‌ చేసిన నీచమైన పనిపై జాతీయ మహిళా కమిషన్‌, పొరుగు రాష్ట్రాల ఎంపీలు స్పందించి తప్పు పడుతూ లేఖలు రాస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మొదట ఓ మాట, తర్వాత మరో మాట మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారంలో కులాల మధ్య ఘర్షణలు తీసుకువస్తున్నారు. మాధవ్‌ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా జగన్‌ స్పందించి చర్యలు తీసుకోవాలి’.. అని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని