logo

ముగిసిన ఎన్‌సీసీ ‘బి’ పరీక్ష

గుంటూరు ఎన్‌సీసీ 25 ఆంధ్రా బెటాలియన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘బి’ సర్టిఫికెట్‌ రాత పరీక్ష వడ్లమూడి విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో ఆదివారం ముగిసింది.

Published : 06 Feb 2023 05:33 IST

పరీక్ష తీరును పర్యవేక్షిస్తున్న గుంటూరు గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ జయకుమార్‌

నవభారత్‌నగర్‌(గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరు ఎన్‌సీసీ 25 ఆంధ్రా బెటాలియన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘బి’ సర్టిఫికెట్‌ రాత పరీక్ష వడ్లమూడి విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో ఆదివారం ముగిసింది. మొత్తం 713 మందికిగాను 685 మంది పరీక్షకు హాజరైనట్లు 25 బెటాలియన్‌ కమాండింగ్‌ అధికారి కల్నల్‌ వీరేందర్‌సింగ్‌ చెప్పారు. శనివారం ప్రాక్టికల్‌ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. గుంటూరు ఎన్‌సీసీ గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ జయకుమార్‌ పరీక్ష తీరును పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని