logo

ఓటర్ల జాబితా సవరణకు శ్రీకారం

షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సవరణ ప్రక్రియ మొదలైంది.

Published : 09 Jun 2023 06:02 IST

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సవరణ ప్రక్రియ మొదలైంది. వచ్చే జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన అందరికీ ఓటుహక్కు కల్పించే చర్యల్ని తీసుకోవాలని ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు చేసింది. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్తగా నమోదైన 18-19 ఏళ్ల ఓటర్లకు డిజిటల్‌ గుర్తింపు కార్డుల్ని పంపిణీ చేయనుంది. ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఇప్పటికే గురిపెట్టాయి.


షెడ్యూలు ఇలా...

* ఈనెల 20 వరకు మారిన విధానాలపై ఈఆర్‌వో, ఏఈఆర్‌వో, బీఎల్‌వోలకు శిక్షణలు
* ఆగస్టు 22 నుంచి సెప్టెంబరు 29 వరకు పోలింగ్‌ కేంద్రాల క్రమబద్ధీకరణ, మౌలిక వసతుల కల్పనపై దృష్టి.
* సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10 వరకు ఫార్మేట్‌ 1 నుంచి 8, డ్రాఫ్ట్‌రోల్‌ సిద్ధం చేస్తారు.
* అక్టోబరు 17న డ్రాఫ్ట్‌ ఎలక్ట్రోరల్‌ ప్రచురణ
* అక్టోబరు 17 నుంచి నవంబరు 30 వరకు ఓటర్ల చేర్పులు, అభ్యంతరాల దరఖాస్తుల స్వీకరణ
* డిసెంబరు 26లోపు చేర్పులు, తొలగింపులు, ఇతర క్లెయిమ్‌ల పరిష్కారం
* 2024, జనవరి 1న ఓటర్ల జాబితాల తుది పరిశీలన.
* 2024 జనవరి 5న తుది ఓటర్ల జాబితాల ప్రచురణ.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని