Hyderabad: హైదరాబాద్‌లో మళ్లీ దంచికొట్టిన వర్షం

భాగ్యనగర వాసులపై వరుణుడు మరోసారి ప్రతాపం చూపించాడు. వరుసగా రెండో రోజు హైదరాబాద్‌లోని

Updated : 27 Sep 2022 17:21 IST

హైదరాబాద్‌: భాగ్యనగర వాసులపై వరుణుడు మరోసారి ప్రతాపం చూపించాడు. వరుసగా రెండో రోజు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, ట్రూప్ బజార్, నాంపల్లి, బషీర్ బాగ్, లక్డీకాపూల్‌,  నారాయణగూడ, హైదర్‌గూడ, హిమాయత్‌నగర్‌, మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్‌, నాంపల్లి, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట్‌, అల్వాల్‌, ప్యాట్నీ, ప్యారడైజ్‌, చిలకలగూడ, తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరదనీరు రోడ్లపైకి చేరడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

రాగల 3రోజులు భారీ వర్ష సూచన

తెలంగాణలో రాగల 3రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు వాయువ్య దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోందని వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. ఇది సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉందన్నారు. మరొక ఉపరితల ఆవర్తనం తూర్పు, మధ్య బంగాళాఖాతంలో అక్టోబరు 1న ఏర్పడే అవకాశం ఉందని వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని