TS High court: జూనియర్‌ లెక్చరర్‌ పరీక్షపై టీఎస్‌పీఎస్సీ నిర్ణయం సరికాదు: హైకోర్టు

జూనియర్‌ లెక్చరర్‌ పరీక్ష పేపర్‌-2 ప్రశ్నపత్రాన్ని తెలుగులోనూ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. ఆంగ్లంలోనే ఇవ్వాలన్న టీఎస్‌పీఎస్సీ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 20 Mar 2023 20:51 IST

హైదరాబాద్‌: జూనియర్‌ లెక్చరర్‌ పరీక్ష ప్రశ్నపత్రాన్ని ఆంగ్లంలోనే ఇవ్వాలన్న తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పేపర్‌-2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీ నిమిత్తం గతేడాది డిసెంబరు 9న జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం నిర్వహించే పరీక్షలకు ప్రశ్నపత్రాలను ఆంగ్లంలోనే ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఆదిలాబాద్‌కు చెందిన టి.విజయ్‌కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించడం సరికాదని వ్యాఖ్యానించింది. జేఎల్‌ పేపర్‌-2 ప్రశ్నపత్రం ఆంగ్లం, తెలుగులో ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని