logo

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతల పరస్పర దాడులు

గాంధీభవన్‌లో కార్వాన్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు పరస్పరం దాడి చేసుకున్నారు. సోమవారం పార్టీ హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థి మహ్మద్‌ వలీవుల్లా సమీర్‌ను నియోజకవర్గంలో ప్రచారానికి ఆహ్వానించేందుకు కార్వాన్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి ఉస్మాన్‌బిన్‌ అల్‌హాద్రీ, ఇతర నాయకులు గాంధీభవన్‌కు వచ్చారు.

Published : 07 May 2024 01:56 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: గాంధీభవన్‌లో కార్వాన్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు పరస్పరం దాడి చేసుకున్నారు. సోమవారం పార్టీ హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థి మహ్మద్‌ వలీవుల్లా సమీర్‌ను నియోజకవర్గంలో ప్రచారానికి ఆహ్వానించేందుకు కార్వాన్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి ఉస్మాన్‌బిన్‌ అల్‌హాద్రీ, ఇతర నాయకులు గాంధీభవన్‌కు వచ్చారు. ప్రచారానికి నిధులు కావాలని కోరారు. ఈ విషయంలో నియోజకవర్గం నేతల మద్య మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది.  ఒకరిపై ఒకరు చేయిచేసుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడే ఉన్న ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్‌ అలీఖాన్‌, ఉస్మాన్‌ బిన్‌ అల్‌హాద్రి ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. తర్వాత మన్సూర్‌అలీ ఖాన్‌ అసహనంతో బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటనతో గాంధీభవన్‌లో కొద్దిసేపు ఉద్రిక్తత  నెలకొన్నది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని