logo

సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు

పెద్దపల్లిలో సోమవారం నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలకు మున్సిపల్‌ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌పై విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేశారు.

Published : 03 Oct 2022 04:59 IST


ఎల్లమ్మ చెరువు కట్టపై విద్యుత్తు వెలుగులు, పడవలను సిద్ధం చేస్తున్న సిబ్బంది

పెద్దపల్లి, న్యూస్‌టుడే: పెద్దపల్లిలో సోమవారం నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలకు మున్సిపల్‌ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌పై విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేశారు. బతుకమ్మల నిమజ్జన సమయంలో ఎవరూ చెరువులోకి దిగకుండా బారికేడ్లు వేశారు. మరోవైపు సద్దుల బతుకమ్మకు పూల కొనుగోళ్లతో పెద్దపల్లిలోని జెండాకూడలి ప్రాంతం కిక్కిరిసిపోయింది. వాహనాలను సాగర్‌రోడ్డు వైపు మళ్లించారు. జెండాకూడలి వైపు వాహనాలు వెళ్లకుండా వివిధ మార్గాలను మూసివేశారు.


పెద్దపల్లి జెండా కూడలి వద్ద పూల కొనుగోలుకు రద్దీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని