logo

‘భారాసను గద్దె దించడమే లక్ష్యం’

భారాసను గద్దెదించేందుకు బహుజనులంతా ఏకం కావాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

Published : 08 Feb 2023 06:14 IST

ధర్మారంలో మాట్లాడుతున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

ధర్మారం, న్యూస్‌టుడే: భారాసను గద్దెదించేందుకు బహుజనులంతా ఏకం కావాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం రాత్రి ధర్మారంలో బీఎస్పీ ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించిన అనంతరం ప్రధాన కూడలిలో ప్రసంగించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తన కుటుంబ సభ్యులన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తన కుటుంబంలోని నలుగురికి పదవులు కట్టబెట్టారన్నారు. రాజ్యాంగం ప్రకారం గెలుపొంది పదవులు పొందిన ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలన్నారు. బీఎస్పీ బహుజన రాజ్యాధికార యాత్రను అడ్డుకునేందుకు భారాస అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని