icon icon icon
icon icon icon

Ponnam Prabhakar: ఎంపీగా కరీంనగర్‌కు బండి సంజయ్‌ ఏం చేశారు?: మంత్రి పొన్నం

ముస్లింలను ఉద్దేశించి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలను భాజపా వక్రీకరించిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar) అన్నారు. ప్రధానిగా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన మోదీ నీచంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Published : 23 Apr 2024 12:20 IST

కరీంనగర్‌: ముస్లింలను ఉద్దేశించి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలను భాజపా వక్రీకరించిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar) అన్నారు. ప్రధానిగా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన మోదీ నీచంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కరీంనగర్‌ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌ రావేనని.. ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్‌ అవసరం లేదన్నారు. మంచిరోజు అయినందున సోమవారం నామినేషన్‌ వేయించామని తెలిపారు. ఆయన అభ్యర్థిత్వంపై అతి త్వరలో ప్రకటన వస్తుందని చెప్పారు.

‘‘తొలి దశ ఎన్నికల పోలింగ్‌ తర్వాత మోదీ వెన్నులో వణుకు పుడుతోంది. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని ఆయన చెప్పడం విచారకరం. ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి. మా పార్టీ హామీలైన పాంచ్‌ న్యాయ్‌, కులగణన వంటివి భాజపాకు రుచించడం లేదు. మేం అన్నివర్గాలకు న్యాయం చేసేవిధంగా పాలించాం. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఉపాధి హామీ నిధులు కూడా తానే తెచ్చినట్లు బండి సంజయ్‌ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. ఎంపీగా కరీంనగర్‌కు ఏం చేశారు? తల్లీబిడ్డల గురించి ఆయన అవమానకరంగా మాట్లాడారు. భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను ఎందుకు తొలగించారో చెప్పాలి’’ అని పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img