logo

క్యూఆర్‌ కోడ్‌తో ఓపీ నమోదు

చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే వారు ఓపీ నమోదులో పడుతున్న ఇబ్బందులను తప్పించేందుకు ప్రభుత్వం క్యూఆర్‌కోడ్‌ ద్వారా ఓపీ నమోదు చేసుకునే సదుపాయం కల్పించిందని గోదావరిఖనిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ హిమబిందుసింగ్‌ అన్నారు.

Updated : 04 May 2024 05:51 IST

గోదావరిఖని పట్టణం, న్యూస్‌టుడే: చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే వారు ఓపీ నమోదులో పడుతున్న ఇబ్బందులను తప్పించేందుకు ప్రభుత్వం క్యూఆర్‌కోడ్‌ ద్వారా ఓపీ నమోదు చేసుకునే సదుపాయం కల్పించిందని గోదావరిఖనిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ హిమబిందుసింగ్‌ అన్నారు. గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనంలో ఏర్పాటు చేసిన ఈ సదుపాయాన్ని ఆమె శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌ చేసి వివరాలు పూరించగానే వచ్చే టోకెన్‌ నెంబరును ఓపీ నమోదు కేంద్రంలో చెప్పగానే వెంటనే ఆన్‌లైన్‌లో ఓపీ నమోదు చీటీ ఇస్తారని ఆమె వివరించారు. చికిత్స కోసం వచ్చే వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్ డాక్టర్‌ దయాల్‌సింగ్‌, రెసిడెంట్ మెడికల్‌ అధికారులు డాక్టర్‌ అప్పారావు, డాక్టర్‌ తిరుమలేశ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని