logo

ఉపాధి హామీతో అభివృద్ధి పనులు

ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారని, కూలీలు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక శాసనసభ్యుడు దడేసుగూరు బసవరాజ్‌ సూచించారు. శ్రీరామనగర్‌ చిలుకూరి నాగేశ్వరరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రూ.16 లక్షల

Published : 18 Jan 2022 01:32 IST


మొక్కకు నీరు పోసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న శాసనసభ్యుడు దడేసుగూరు బసవరాజ్‌

శ్రీరామనగర్‌, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారని, కూలీలు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక శాసనసభ్యుడు దడేసుగూరు బసవరాజ్‌ సూచించారు. శ్రీరామనగర్‌ చిలుకూరి నాగేశ్వరరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రూ.16 లక్షల ఉపాధి పనులతో చేపట్టిన క్రీడా మైదానాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు తమకు ఇష్టమైన క్రీడల్లో తరచూ పాల్గొనాలని సలహానిచ్చారు. వాలీబాల్‌, షటిల్‌, బాస్కెట్‌ బాల్‌, షాట్‌ఫుట్‌, కబడ్డీ క్రీడా మైదానాలతో పాటు 225 మీటర్ల వాకింగ్‌ ట్రాక్‌ను ప్రారంభించారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని గ్రామీణ యువ క్రీడా ఉత్సవం ప్రారంభమైంది. జిల్లా పంచాయతీ సీఈవో ఫౌజియా తరున్నమ్‌ వాలీబాల్‌ క్రీడను ప్రారంభించారు. గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు రేణుకమ్మ, ఉపాధ్యక్షుడు రెడ్డి వీర్రాజు, నాయకులు సి.రామకృష్ణ, సత్యనారాయణ దేశ్‌ పాండే, గ్రామ పంచాయతీ సభ్యులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, యువకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని