logo

26న విజయనగర పాలనాధికారి కార్యాలయం ప్రారంభం

విజయనగర జిల్లా పాలనాధికారి కార్యాలయం ప్రారంభోత్సవానికి సొబగులద్దుతున్నారు. తుంగభద్ర జలాశయ ప్రాంతంలో ఉన్న ఉక్కు పరిశ్రమ పాత భవనానికి ఆరు నెలలుగా పునర్నిర్మాణ పనులు చేపట్టారు. గణతంత్ర వేడుకల సందర్భంగా 26న మంత్రి ఆనంద్‌సింగ్‌

Published : 21 Jan 2022 06:31 IST


హొసపేటెలో కార్యాలయానికి సొబగులద్దుతున్న దృశ్యం

హొసపేటె, న్యూస్‌టుడే: విజయనగర జిల్లా పాలనాధికారి కార్యాలయం ప్రారంభోత్సవానికి సొబగులద్దుతున్నారు. తుంగభద్ర జలాశయ ప్రాంతంలో ఉన్న ఉక్కు పరిశ్రమ పాత భవనానికి ఆరు నెలలుగా పునర్నిర్మాణ పనులు చేపట్టారు. గణతంత్ర వేడుకల సందర్భంగా 26న మంత్రి ఆనంద్‌సింగ్‌ పాలనాధికారి కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. రెండు అంతస్తులున్న ఈ భవనంలో జిల్లా పాలనాధికారి, పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, ప్రణాళిక అధికారి, ఇతర ముఖ్య జిల్లాస్థాయి కార్యాలయాలు ఉంటాయి. విజయనగర జిల్లా ప్రజలు ఒకే చోట అన్ని శాఖల అధికారులను కలిసి పనులు చేయించుకునే వెసులుబాటు కలిగింది. ప్రస్తుతం జిల్లా పాలనాధికారి కార్యాలయం అమరావతిలోని ప్రభుత్వ అతిథి గృహంలో, జడ్పీ కార్యాలయం ఎంపీ ప్రకాశ్‌నగర్‌లో ఉన్నాయి. వివిధ పనుల నిమిత్తం వస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 26 నుంచి సగం జిల్లా కార్యాలయాలు ఒకేచోట అందుబాటులోకి రానున్నాయి. ‘తుంగభద్ర జలాశయం ప్రాంతంలోని 83 ఎకరాల్లో మినీ విధానసౌధ నిర్మాణం అనంతరం దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అక్కడికి మారుతాయి. అప్పటివరకూ ఈ భవనంలోనే కొనసాగుతాయని’ పాలనాధికారి పి.అనిరుద్ధ్‌ శ్రవణ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని