logo

విమ్స్‌లో అత్యవసర సేవలు మాత్రమే!

బళ్లారి విమ్స్‌ ఆసుపత్రిలో సాధారణ రోగులకు చికిత్స చేయరు. అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందుతాయని బాధ్య సంచాలకుడు డా.గంగాధర్‌గౌడ నోటీసు ద్వారా తెలియజేశారు. ప్రధాన ద్వారం ముందు గోడలకు ఈ నోటీసు అతికించారు. బళ్లారి, విజయనగర

Published : 21 Jan 2022 06:31 IST

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి విమ్స్‌ ఆసుపత్రిలో సాధారణ రోగులకు చికిత్స చేయరు. అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందుతాయని బాధ్య సంచాలకుడు డా.గంగాధర్‌గౌడ నోటీసు ద్వారా తెలియజేశారు. ప్రధాన ద్వారం ముందు గోడలకు ఈ నోటీసు అతికించారు. బళ్లారి, విజయనగర జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని కొవిడ్‌ రోగుల చికిత్సకు కేటాయించారు. వీరు మళ్లీ సాధారణ రోగులకు చికిత్స చేసే పరిస్థితి లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. విమ్స్‌కు రోజూ దాదాపు ఐదువేల మంది చికిత్సకు వచ్చేవారు. ఇందులో అత్యవసర వైద్యం దాదాపు 300 మందికి అవసరమయ్యేది. సుమారు 50 శస్త్రచికిత్సలు చేసేవారు. ప్రస్తుతం వివిధ విభాగాలను కొవిడ్‌ సేవలకు కేటాయించడంతో సామాన్య రోగులను చూసే అవకాశం లేకపోయింది. ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి సృష్టించారని సాధారణ రోగులు బాధపడుతున్నారు. వారు ఇదే అదనుగా ఇష్టారాజ్యంగా రుసుములు వసూలు చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిరంతరం సేవలు: విమ్స్‌లో అత్యవసర రోగులకు మాత్రమే చికిత్స చేస్తామని ఆసుపత్రి ముఖ్య పర్యవేక్షకుడు డా.అశ్వినికుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు. అత్యసవర రోగులకు 24 గంటలూ వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించామన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని