logo

మంత్రి ఆనంద్‌సింగ్‌కు సీఎం ఝలక్‌

బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రిగా ఉన్న ఆనంద్‌సింగ్‌కు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఝలక్‌ ఇచ్చారు. ఆయన్ను రెండూ జిల్లాల బాధ్య మంత్రిగా తప్పించి పొరుగు జిల్లా అయిన కొప్పళకు బాధ్య మంత్రిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనుకోని ఈ పరిణామాలతో విజయనగర (హొసపేటె) నియోజకవర్గం

Published : 25 Jan 2022 04:37 IST


పట్టణంలోని రోటరీ కూడలిలో టైర్లకు నిప్పంటించి ఆందోళన చేస్తున్న కార్యకర్తలు

హొసపేటె, న్యూస్‌టుడే: బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రిగా ఉన్న ఆనంద్‌సింగ్‌కు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఝలక్‌ ఇచ్చారు. ఆయన్ను రెండూ జిల్లాల బాధ్య మంత్రిగా తప్పించి పొరుగు జిల్లా అయిన కొప్పళకు బాధ్య మంత్రిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనుకోని ఈ పరిణామాలతో విజయనగర (హొసపేటె) నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా అయోమయ పరిస్థితిలో పడిపోయారు. 26న తాలూకా క్రీడామైదానంలో జరిగే గణతంత్ర వేడుకలలో మంత్రి జెండా ఎగురు వేస్తారని అందరూ భావించారు. మంత్రి శశికళా జొల్లెను విజయనగర జిల్లా బాధ్య మంత్రిగా నియమించారు.అందులో ప్రముఖులు బళ్లారి నగర ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌ రెడ్ఢి ఆయన తమ జిల్లాకు ఆనంద్‌సింగ్‌ బాధ్యమంత్రిగా వద్దని బహిరంగంగా ప్రకటనలు చేశారు. మంత్రి ఆనంద్‌సింగ్‌ కూడా మంత్రి శ్రీరాములు కోరితే బళ్లారి జిల్లా బాధ్యతను వదులుకుంటానని పలుసార్లు పేర్కొన్నారు. తనకు విజయనగర జిల్లా బాధ్యత ఇస్తే చాలని కోరుకునేవారు. అందరి అంచనాలను సీఎం తలకిందులు చేశారు. మంత్రి ఆనంద్‌సింగ్‌కు కొప్పళ బాధ్యత అప్పగించారు. మంత్రి శశికళా జొల్లెకు విజయనగర బాధ్యత అప్పగిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

భగ్గుమన్న భాజపా కార్యకర్తలు

మంత్రి ఆనంద్‌సింగ్‌కు విజయనగర జిల్లా బాధ్యత అప్పగించండి. కొత్త జిల్లా ఏర్పాటు అనంతరం ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని భాజపా కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. మంత్రి ఆనంద్‌సింగ్‌కు బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్యత తప్పించి కొప్పళ జిల్లా బాధ్యత అప్పగించి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో హొసపేటెలో కార్యకర్తలు భగ్గుమన్నారు. రోటరీ కూడలిలో టైర్లకు నిప్పంటించి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అదే సమయంలో తహసీల్దారు కార్యాలయంలో ఓ సమావేశం ముగించుకుని ఆందోళన ప్రాంతానికి వచ్చిన మంత్రి ఆనంద్‌సింగ్‌ని కార్యకర్తలు చుట్టుముట్టారు. మళ్లీ విజయనగర జిల్లా బాధ్యత తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లా బాధ్యత అంశాన్ని ముఖ్యమంత్రి తన వద్ద చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతా నా మంచికే జరిగింది. కార్యకర్తలు అనవసరంగా ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్నారు.

కార్యకర్తలపై కేసు నమోదు

ఆనంద్‌సింగ్‌కు తిరిగి బళ్లారి జిల్లా బాధ్యమంత్రి స్థానం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం సాయంత్రం హొసపేటె రోటరీ కూడలిలో కొవిడ్‌ నియమాలను ఉల్లంఘించి టైర్లకు నిప్పంటించి ఆందోళన చేసిన భాజపా కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్యకర్తలు మధుర చెన్నశాస్త్రి, అంతోని దాస్‌తోపాటు 30 మందిపై పట్టణ పోలీస్‌ ఠాణాల కేసు నమోదు చేసినట్లు విజయనగర జిల్లా పోలీస్‌ అధికారి డాక్టర్‌ కె.అరుణ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని