logo

గవిమఠం అక్షర సేవ అద్వితీయం

కొప్పళ గవిమఠం అక్షర సేవ అద్వితీయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌ కొనియాడారు. ఆయన గురువారం గవిమఠం నిర్మించ తలపెట్టిన ఐదువేల విద్యార్థుల వసతినిలయానికి శంకుస్థాపన నెరవేర్చి మాట్లాడారు. గవిసిద్దేశ్వర మహాస్వామి గవిమఠం అన్నం, అక్షరం, ఆధ్యాత్మికత పరంపరను కొనసాగిస్తూ అందరి ప్రేమాభిమానాలకు పాత్రులయ్యారన్నారు.

Updated : 24 Jun 2022 06:55 IST

వసతి నిలయానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి ఆనంద్‌సింగ్‌

గంగావతి, న్యూస్‌టుడే: కొప్పళ గవిమఠం అక్షర సేవ అద్వితీయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌ కొనియాడారు. ఆయన గురువారం గవిమఠం నిర్మించ తలపెట్టిన ఐదువేల విద్యార్థుల వసతినిలయానికి శంకుస్థాపన నెరవేర్చి మాట్లాడారు. గవిసిద్దేశ్వర మహాస్వామి గవిమఠం అన్నం, అక్షరం, ఆధ్యాత్మికత పరంపరను కొనసాగిస్తూ అందరి ప్రేమాభిమానాలకు పాత్రులయ్యారన్నారు. ఆయన చేపట్టే ప్రజోపయోగ పనులకు సమాజం చేదోడుగా ఉంటుందన్నారు. గవిమఠం చేపట్టిన విద్యాదానానికి ఆయన రూ.కోటి ఎనిమిది లక్షల విరాళం ప్రకటించారు.
గవిసిద్దేశ్వరస్వామి కంటతడి: గవిమఠం అక్షర దాసోహానికి ఆంది పలికిన మరిశాంతవీర స్వామీజీని తలుచుకుని గవిసిద్దేశ్వర స్వామీజీ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. కాశీలో 16 సంవత్సరాలు చదువుకుని మఠానికి పీఠాధిపతిగా భాద్యతలు స్వీకరించిన మరిశాంత వీరస్వామి విద్యాసంస్థలు. వసతి నిలయాలను స్థాపించారన్నారు. 160 మంది విద్యార్థులతో ప్రారంభమైన వసతినిలయం నేడు 3,500 మందికి ఆశ్రయమిస్తోందన్నారు. ఆయన 55వ పుణ్యతిథి నాడు 5,000 మంది విద్యార్థుల వసతినియానికి శంకుస్థాపన నెరవేర్చే భాగ్యం తనకు దక్కిందని భావోద్వేగానికి లోనయ్యారు. మరిశాంతవీర స్వామీజీ ఊరూరా భిక్షాటన చేసి విద్యాసంస్థలు స్థాపించడాన్ని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గనుల శాఖ మంత్రి హాలప్పా ఆచార్‌, లోక్‌సభ సభ్యుడు సంగణ్ణ కరడి, శాసనసభ్యులు పరణ్ణ మునవళ్ళి, రాఘవేంద్ర హిట్నాళ, జిల్లా పాలనాధికారి వికాస్‌కిశోర్‌, ఎస్పీ ఎ.గిరి, జడ్పీ సీఈవో ఫౌజియా తరున్నమ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని