logo

చారిత్రక నాటక సుప్రసిద్ధులు..కోలాచలం

నాటకాల్ని జనరంజకం చేసిన సుప్రసిద్ధ రచయిత చారిత్రక నాటక పితామహుడు కోలాచలం శ్రీనివాసరావని రాఘవ స్మారక సంఘం గౌరవ అధ్యక్షుడు కనుగోలు చన్నప్ప పేర్కొన్నారు.

Published : 24 Jun 2022 01:56 IST

రాఘవ సంగీతభవన్‌లో కోలాచలం శ్రీనివాసరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న ఆర్‌.ఎం.ఎ ప్రముఖులు

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: నాటకాల్ని జనరంజకం చేసిన సుప్రసిద్ధ రచయిత చారిత్రక నాటక పితామహుడు కోలాచలం శ్రీనివాసరావని రాఘవ స్మారక సంఘం గౌరవ అధ్యక్షుడు కనుగోలు చన్నప్ప పేర్కొన్నారు. గురువారం కోలాచలం శ్రీనివాసరావు వర్ధంతిని పురస్కరించుకుని రాఘవ సంగీత భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కోలాచలం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు నాటక రంగ అభ్యుదయ వికాసాలకు కృషి చేసిన మహనీయడన్నారు. ప్రపంచ నాటక చరిత్రను ఆంగ్లభాషలో రచించి నాటక రంగంపై ఆంగ్లభాషలో వెలవడిన తొలి గొప్ప గ్రంథంగా కీర్తినందించిన నాటకకర్త కోలాచలం అన్నారు. చారిత్రక నాటక రచనలతో నాటకానికి నవ్యదిశను కల్పించిన నాటక పితామహుడని, భగవద్గీతపై విపులమైన వ్యాఖ్యానం రాసి, ఎంతో గొప్ప జ్ఞానసంపదను తెలుగువారికి అందించిన గీతార్థవ్యాఖ్యాత కోలాచలం శ్రీనివాసరావు అని కీర్తించారు. రచయితగా, వ్యాసకర్తగా, పరిశోధకుడిగా తెలుగు నాటక రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. విశ్రాంత ఉపన్యాసకుడు బసవరాజు కొలాచలం జీవిత చరిత్రను వివరించారు. కార్యక్రమంలో రాఘవస్మారక సంఘం ప్రతినిధులు రమేష్‌గౌడ పాటిల్‌, పంపనగౌడ, రామాంజినేయులు, డా.సురేంద్రబాబు, జి.ఆర్‌.వెంకటేశులు, శాంసుందర్‌, శ్రీనివాసులు, కృష్ణ, అమరేంద్రచౌదరి, డా.గాదిలింగనగౌడ, రామచంద్ర, గోపాలకృష్ణ, కొలాచలం కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని