logo

గాంధీజీ రాకతో బళ్లారిలో స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపు

ఆజాదికా అమృత్‌ మహోత్సవం పురస్కరించుకుని బళ్లారిలో జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదురుగా ఉన్న రైల్వే స్టేషన్‌ ఆవరణలో మహత్మాగాంధీ విగ్రహాన్ని, బళ్లారి కంటోన్మెంట్‌లోని విమ్స్‌ ఆసుపత్రి అవరణంలో డా.బాబురాజేంద్రప్రసాద్‌ విగ్రహాన్ని శనివారం జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు ఆవిష్కరించారు

Published : 26 Jun 2022 04:46 IST

రైల్వే స్టేషన్‌ ముందు మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే : ఆజాదికా అమృత్‌ మహోత్సవం పురస్కరించుకుని బళ్లారిలో జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదురుగా ఉన్న రైల్వే స్టేషన్‌ ఆవరణలో మహత్మాగాంధీ విగ్రహాన్ని, బళ్లారి కంటోన్మెంట్‌లోని విమ్స్‌ ఆసుపత్రి అవరణంలో డా.బాబురాజేంద్రప్రసాద్‌ విగ్రహాన్ని శనివారం జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు. మహత్మాగాంధీ 1921 అక్టోబరు 1న బళ్లారి రైల్వే స్టేషన్‌లో ఎనిమిది గంటల పాటు విశ్రాంతి తీసుకున్నారు. 1934 మార్చిలో స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా నిధుల సేకరణకు గాంధీ బళ్లారికి వచ్చారన్నారు. గాంధీ రాకతో ఈ ప్రాంతానికి పోరాటం చేసే శక్తి వచ్చిందన్నారు. జిల్లాలో కూడ్లిగి, కొట్టూరు ప్రాంతం యువకులను సైనికులుగా తీర్చిదిద్దారని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటం, ఉప్పు సత్యాగ్రహం, తదితర పోరాటాల్లో పాల్గొన్న వారిని బళ్లారి అల్లీపురం జైల్లో బంధించారన్నారు.బళ్లారి ప్రస్తుతం విమ్స్‌ ఆసుపత్రి, అప్పటి అల్లీపురం జైల్లో జైలు జీవనం గడిపారు, దీనికి గుర్తుగా ఈ ప్రాంతంలో డా.బాబురాజేంద్రప్రసాద్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మహనీయుల చరిత్ర, తదితర వాటిపై విమ్స్‌లో మ్యూజియం అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో లోక్‌సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్‌, పాలికె మేయర్‌ మోదపల్లి రాజేశ్వరి, మండలి అధ్యక్షుడు హనుమంతప్ప, బుడా అధ్యక్షుడు పి.పాలన్న, ఎ.పి.ఎం.సి. అధ్యక్షుడు ఉమేష్‌, జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్‌ మాలపాటి, ఎస్పీ సైదులు అడావత్‌, జిల్లా పంచాయతీ సీఈవో జి.లింగమూర్తి, ఏడీసీ మంజునాథ, విమ్స్‌ బాధ్య సంచాలకుడు డా.గంగాధరగౌడ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని