logo

చోరుల ఇంట సెల్‌ఫోన్ల గుట్ట!

నగరంలోని వివిధ ప్రాంతాల్లో సెల్‌ఫోన్లను దొంగిలించి తక్కువ ధరలకు ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారనే ఆరోపణపై పాదరాయణపుర ప్రాంతానికి చెందిన అబ్దుల్‌పాషా, శివాజినగర ఇజాజ్‌ అనే వ్యక్తులను

Published : 12 Aug 2022 01:18 IST

స్వాధీనపరుచుకున్న నాజూకు చరవాణులను పరిశీలిస్తున్న కొత్వాలు ప్రతాప్‌ రెడ్డి

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : నగరంలోని వివిధ ప్రాంతాల్లో సెల్‌ఫోన్లను దొంగిలించి తక్కువ ధరలకు ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారనే ఆరోపణపై పాదరాయణపుర ప్రాంతానికి చెందిన అబ్దుల్‌పాషా, శివాజినగర ఇజాజ్‌ అనే వ్యక్తులను బెంగళూరు నేర నియంత్రణ విభాగం (సీసీబీ) పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.78.84 లక్షల విలువ చేసే 512 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం ఇక్కడ తన కార్యాలయంలో ఆ సెల్‌ఫోన్లను పరిశీలించారు. కొందరు వారసుదారులను గుర్తించి అప్పగించారు. ఇక్కడ చోరీ చేసిన సెల్‌ఫోన్లను హైదరాబాద్‌, ముంబయి, దిల్లీలో విక్రయించేవారని గుర్తించామన్నారు. చామరాజపేట, ఉప్పారపేట, మాగడిరోడ్డు, కామాక్షిపాళ్య, వర్తూరు తదితర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు తేలిందన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని