logo

పర్యాటక అభివృద్ధికి కృషి

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మించేరి కొండపై జాతీయ పతాకాన్ని మంత్రి బి.శ్రీరాములు ఆదివారం ఎగురవేశారు. ఈ సందర్భంగా రూ.60 లక్షలతో ఆధునికీకరించిన అతిథి భవనాన్ని ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్‌తో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారు.

Published : 15 Aug 2022 02:48 IST

బళ్లారి : మించేరి కొండపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవందనం స్వీకరిస్తున్న మంత్రి బి.శ్రీరాములు, తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మించేరి కొండపై జాతీయ పతాకాన్ని మంత్రి బి.శ్రీరాములు ఆదివారం ఎగురవేశారు. ఈ సందర్భంగా రూ.60 లక్షలతో ఆధునికీకరించిన అతిథి భవనాన్ని ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్‌తో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారు. మించేరి కొండ ప్రకృతి అందాలకు నిలయం.. ఇక్కడి ప్రకృతి అందాలను చూస్తుంటే మనుసు ప్రశాంతంగా ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం హోటల్స్‌, అతిథి భవనాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. జిల్లా అటవీశాఖ ఉప సంరక్షణాధికారి సందీప్‌ సూర్యవంశీ మాట్లాడారు. కార్యక్రమంలో శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్‌, బళ్లారి నగర మేయర్‌ మోదపల్లి రాజేశ్వరి, బుడా అధ్యక్షుడు పి.పాలన్న, జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్‌, ఎస్పీ సైదులు అడావత్‌, పీసీసీఎఫ్‌ హరిలాల్‌, జిల్లా పంచాయతీ సీఈవో జి.లింగమూర్తి, అదనపు జిల్లా పాలనాధికారి మంజునాథ, ఏసీ డా.ఆకాశ్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

‘రాష్ట్ర నాయకత్వంపై ఎలాంటి గందరగోళం లేదు’

బళ్లారి, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం లేదని న్యాయశాఖ మంత్రి మాధుస్వామి ఏ పరిస్థితుల్లో వ్యాఖ్యనించారో తెలియదు. ఇలాంటి ప్రకటన చేసే ముందు కాస్త ఆలోచించి ఉండాల్సిందని మంత్రి బి.శ్రీరాములు హితవు పలికారు. ఆదివారం బళ్లారి తాలూకా మించేరి కొండపై త్రివర్ణ జెండాను మంత్రి ఎగురవేసి అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర నాయకత్వం విషయంలో తమ పార్టీలో ఎలాంటి గందరగోళం లేదన్నారు. 2023 విధానసభ ఎన్నికలను ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై నాయకత్వంలోనే ఎదుర్కొంటామన్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్ఠానం కూడా స్పష్టం చేసిందన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి ముఖ్యమంత్రి, మంత్రి వర్గం సహచరులు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్‌, శాసనసభ మాజీ సభ్యుడు సురేష్‌బాబు, లోక్‌సభ మాజీ సభ్యురాలు జె.శాంత తదితరులు

బళ్లారిలో గాంధీ భవనం ప్రారంభం

బళ్లారి, న్యూస్‌టుడే : బళ్లారి జిల్లా పాలనాధికారి ఆవరణలో గాంధీ భవనం నిర్మించి మహాత్మాగాంధీ ఆచార, వ్యవహారాలు ప్రజలకు తెలియజేయడానికి అనుకూలంగా మారిందని మంత్రి బి.శ్రీరాములు పేర్కొన్నారు. జిల్లా పాలనాధికారి కార్యాలయం ఆవరణలో రూ.3 కోట్లతో నిర్మించిన గాంధీ భవనాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ఈ భవనంలో చిత్ర ప్రదర్శన, వస్తుప్రదర్శన సాహిత్య కార్యక్రమాల నిర్వహణ కేంద్రంగా మారాలన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యుడు సోమశేఖర్‌రెడ్డి , లోక్‌సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, బుడా అధ్యక్షుడు పి.పాలన్న, ఏపీఎంసీ అధ్యక్షుడు ఉమేష్‌కుమార్‌, జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్‌, వార్తశాఖాధికారి బి.కె.రామలింగప్ప పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని