logo

ఓ దృశ్యం.. ఎన్నో అనుభూతులు!

వెయ్యి పదాలలో వర్ణించలేని విషయాన్ని ఓ చిత్రం ద్వారా అర్థమయ్యేలా వివరించొచ్చు. ఛాయా చిత్రాలు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఆధునిక ప్రపంచంలో ఫొటోగ్రఫీˆ మానవ జీవితంతో పెనవేసుకుని ఉంది.

Published : 19 Aug 2022 04:44 IST

గ్రామీణ జీవనానికి అద్దం పట్టే గోధూళి చిత్రం

చిత్రదుర్గం,న్యూస్‌టుడే : వెయ్యి పదాలలో వర్ణించలేని విషయాన్ని ఓ చిత్రం ద్వారా అర్థమయ్యేలా వివరించొచ్చు. ఛాయా చిత్రాలు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఆధునిక ప్రపంచంలో ఫొటోగ్రఫీˆ మానవ జీవితంతో పెనవేసుకుని ఉంది. యువత ఎక్కడికి వెళ్లినా స్వీయ చిత్రాలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. వాటిని నాలుగు కాలాల పాటు దాచుకుని మధురాను భూతులను నెమరు వేసుకొంటున్నారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఫొటోగ్రఫీˆ విధానాన్ని తొలుత ప్రవేశపెట్టింది నైసోఫర్‌ నిపెస్‌. అప్పటి నుంచి ఫొటోగ్రఫీˆ విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. స్టిల్‌ ఫొటోగ్రఫీ నుంచి ప్రారంభమై, మూకీ, రంగుల చలన చిత్రాలు, వీడియో చిత్రాలుగా మారి నేడు డిజిటల్‌ ఫొటోగ్రఫీˆ, ట్రిక్‌ ఫొటోగ్రఫీˆల స్థాయికి చేరుకుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫొటోగ్రఫీలోనూ నూతన ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. ఛాయాచిత్రాలు, వీడియోలు  క్రిమినల్‌ కేసుల దర్యాప్తునకు ఉపయోగపడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని