logo

‘చిత్ర’ సంబరానికి వేళాయె

చారిత్రక బెంగళూరులో ప్రభుత్వ చిత్ర కళాపరిషత్‌లో చిత్ర సంతకు అధికారులు ముందడుగు వేశారు. జనవరి 8న రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ సహకారంతో ఈ కార్యక్రమానికి మూహూర్తం సిద్ధం చేశామని పరిషత్‌ అధ్యక్షుడు బి.ఎల్‌.శంకర్‌ గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

Updated : 25 Nov 2022 04:40 IST

 చిత్రాలను ప్రదర్శిస్తున్న చిత్రకళా పరిషత్‌ అధ్యక్షుడు బి.ఎల్‌.శంకర్‌ తదితర ప్రముఖులు

బెంగళూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే : చారిత్రక బెంగళూరులో ప్రభుత్వ చిత్ర కళాపరిషత్‌లో చిత్ర సంతకు అధికారులు ముందడుగు వేశారు. జనవరి 8న రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ సహకారంతో ఈ కార్యక్రమానికి మూహూర్తం సిద్ధం చేశామని పరిషత్‌ అధ్యక్షుడు బి.ఎల్‌.శంకర్‌ గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జనవరి 7న చిత్రకళా సమ్మాన్‌ పేరిట కళాకారులను సన్మానిస్తామని వివరించారు. ఆచార్య నంజుండరావు కళా పురస్కారాన్ని జాతీయ స్థాయిలో ప్రదానం చేస్తామన్నారు. అవార్డు కింద రూ.లక్ష నగదు, ప్రశంసాఫలకం అందిస్తామన్నారు. కె.హెచ్‌.కేజ్రీవాల్‌, ఎం.ఆర్యమూర్తి, డి.దేవరాజ్‌ అర్సు, వై.సుబ్రమణ్య రుజు పేర్లతోనూ నలుగురు కళాకారులకు పురస్కారాలు అందిస్తామని చెప్పారు. ఈసారి చిత్రసంతను ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రారంభిస్తారు. కళాప్రదర్శనను ఐటీ, బీటీ శాఖ మంత్రి అశ్వత్థనారాయణ ప్రారంభిస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి కదలివచ్చే కళాకారులు చిత్రాలను ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. కనీసం 1500 కుంచె నిపుణులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని