logo

ఉన్నికృష్ణన్‌ జీవితం.. ఓ సాహసఘట్టం

యువతలో పోరాట స్ఫూర్తి నింపేలా నగరంలోని ఫ్రాంక్‌ ఆంథోణి పబ్లిక్‌ పాఠశాలలో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Published : 27 Nov 2022 01:38 IST

ఉన్నికృష్ణన్‌ విగ్రహానికి నివాళి

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : యువతలో పోరాట స్ఫూర్తి నింపేలా నగరంలోని ఫ్రాంక్‌ ఆంథోణి పబ్లిక్‌ పాఠశాలలో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముంబయిలో 14 ఏళ్ల కిందట నవంబరు నెలలో తీవ్రవాదులను నిలువరిస్తూ సందీప్‌ కన్నుమూశారని మేజర్‌ జనరల్‌ రవి మురుగన్‌ గుర్తు చేశారు. సందీప్‌ విగ్రహాన్ని శనివారం ప్రారంభించి మాట్లాడారు. జీవితంలోని అన్ని దశల్లో పోరాటం, తక్షణమే నిర్ణయాలను తీసుకోగలిన ధీమాను సందీప్‌ జీవితాన్ని చూసి అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్‌సీసీ డైరెక్టరేట్ కర్ణాటక, గోవా విభాగం ఎయిర్‌ కమాండర్‌ బి.కె.కన్వర్‌, రక్షణ శాఖ అధికారులు, విద్యా సంస్థ యాజమాన్య ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మేజర్‌ ఉన్నికృష్ణన్‌ విగ్రహం వద్ద మేజర్‌ జనరల్‌ రవి మురుగన్‌ తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని