logo

విమానంలో ‘ఉత్తుత్తి బాంబు’

కోల్‌కతా నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం సాయంత్రం వచ్చిన ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు సందేశం ఒకటి కనిపించింది.

Published : 29 Nov 2022 01:08 IST

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : కోల్‌కతా నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం సాయంత్రం వచ్చిన ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు సందేశం ఒకటి కనిపించింది. ప్రయాణికులు దిగి వెళ్లిన తర్వాత విమానంలోని 6-డి సీటులో పడి ఉన్న టిష్యూ కాగితంపై విమానంలో బాంబు ఉందని నీలం అక్షరాలతో రాసి ఉన్న కాగితాన్ని విమాన సిబ్బంది గుర్తించారు. తక్షణమే బాంబు నిష్క్రియ దళానికి సమాచారం అందించారు. రన్‌వే నుంచి పక్కకు తీసుకు వెళ్లి విమానాన్ని క్షుణ్ణంగా జల్లెడ పట్టి, అది ఉత్తుత్తి బెదిరింపుగా గుర్తించారు. విమానయాన సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని విమానాశ్రయం పోలీసులు సోమవారం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని