కళ్లెదుటే అంతరిక్ష అద్భుతం
రాజధాని నగరంలోని కస్తూర్‌బా రోడ్డు విశ్వేశ్వరయ్య పారిశ్రామిక, సాంకేతిక వస్తు సంగ్రహాలయం (మ్యూజియం)లోని అంతరిక్ష విభాగంలో మార్స్ రోవర్ నమూనాను అందుబాటులోకి తీసుకు వచ్చారు.
రోవర్ నమూనాను వీక్షిస్తున్న అతిథులు, సందర్శకులు
బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : రాజధాని నగరంలోని కస్తూర్‌బా రోడ్డు విశ్వేశ్వరయ్య పారిశ్రామిక, సాంకేతిక వస్తు సంగ్రహాలయం (మ్యూజియం)లోని అంతరిక్ష విభాగంలో మార్స్ రోవర్ నమూనాను అందుబాటులోకి తీసుకు వచ్చారు. కుజుని (మార్స్)పై ఉన్న రోవర్ పరిణామంలోనే ఇదీ ఉందని మ్యూజియం అధికారి ఆర్.వెంకటేశ్వర్లు తెలిపారు. అమెరికా కౌన్సుల్ జనరల్ సహకారంతో దీన్ని అందుబాటులోకి తీసుకు వచ్చామని చెప్పారు. ఇస్రోలోని యూఆర్ రావు ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్ ఎం.శంకరన్, అమెరికన్ కౌన్సుల్ జనరల్ జుడిత్ రవిన్, అమెరికాలోని అంతర్జాతీయ వాణిజ్య శాఖ అధికారిణి మరిసా లాగో సంయుక్తంగా ఈ విభాగాన్ని గురువారం ప్రారంభించారు. అంతరిక్ష విజ్ఞానం పట్ల ఆసక్తి ఉన్న వారికే కాకుండా, యువ విద్యార్థులలో ఆసక్తి పెంచేలా దీన్ని తయారు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్