బాలికపై అత్యాచారం-నిందితుడికి అరదండాలు
దేవనహళ్లి సమీపంలోని చొక్కనహళ్లి వద్ద బుధవారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో దేవేంద్ర (40) అనే వ్యక్తి మరణించారు.
హొసపేటె, న్యూస్‌టుడే: పాఠశాలకు వెళ్తున్న బాలిక(13)కు మాయమాటలు చెప్పి లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడిన నిందితుడి గుండూరావు(47)పై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకి పంపారు. ఈ సంఘటన విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో జరిగింది. బాలికపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన తరువాత ఎవరికీ చెప్పకూడదని బెదిరించాడు. అయినప్పటికీ బాలిక జరిగిన దారుణాన్ని తల్లికి చెప్పడంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన కానాహొసళ్లి పోలీసులు నిందితుడు గుండూరావును అరెస్టు చేశారు.
ప్రమాదంలో బళ్లారివాసి మృతి
బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : దేవనహళ్లి సమీపంలోని చొక్కనహళ్లి వద్ద బుధవారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో దేవేంద్ర (40) అనే వ్యక్తి మరణించారు. బళ్లారికి చెందిన బాధితుడు స్థానికంగా ఉపాధి పొందేవాడు. బైకుపై వెళుతున్న సమయంలో వేగంగా వచ్చిన భారీ వాహనం ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. దేవనహళ్లి ట్రాఫిక్ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.