logo

కూలిన చిరు విమానం

శిక్షణ కోసం వినియోగిస్తున్న మినీ విమానం కర్ణాటకలోని చామరాజనగర జిల్లా హెచ్‌ మూకహళ్లి వద్ద కుప్పకూలింది.

Published : 02 Jun 2023 02:36 IST

కుప్పకూలి.. కాలిపోతున్న శకలాల వద్ద స్థానికులు

చామరాజనగర, న్యూస్‌టుడే : శిక్షణ కోసం వినియోగిస్తున్న మినీ విమానం కర్ణాటకలోని చామరాజనగర జిల్లా హెచ్‌ మూకహళ్లి వద్ద కుప్పకూలింది. విమానం కూలిపోవడానికి ముందుగా అందులో ఉన్న పైలెట్లు తేజ్‌పాల్‌, భూమిక పారాచూట్ల సహకారంతో కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. పొలంలో పడిన విమానం ఇంజినుతో సహా కొంత భాగం దగ్ధమైంది. విమానం శిథిలాలను చూసేందుకు స్థానిక గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకున్నారు. ఇంజినులో లోపం తలెత్తడంతోనే అది కుప్పకూలిందని ప్రాథమిక దర్యాప్తులో అంచనాకు వచ్చారు.

పారాచూట్ల సహాయంతో ప్రాణాలు దక్కించుకున్న తేజ్‌పాల్‌ ,భూమిక

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని