logo

అక్రమార్కుల నివాసాలపై దాడులు

ఆదాయంతో పొంతన లేని ఆర్జన కలిగి ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నివాసాలు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

Published : 28 Mar 2024 03:11 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : ఆదాయంతో పొంతన లేని ఆర్జన కలిగి ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నివాసాలు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. రాత్రి వరకు సోదాలు కొనసాగించారు. ఈ దాడుల్లో 130 మంది అధికారులు, సిబ్బంది పాల్గొనగా ఇందులో 13 మంది ఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 25 మంది ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. బెంగళూరుతో పాటు 13 జిల్లాల్లోని 60 చోట్ల దాడులు చేశారు. బెంగళూరు మహానగర పాలికె చీఫ్‌ ఇంజినీరు ఎస్‌పీ రంగనాథ్‌, ఉడుపి ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ రూప, కార్వారలో జూనియర్‌ ఇంజినీరు ప్రకాశ్‌ రేవణకర్‌, మైసూరులో ఏఈ ఫయాజ్‌ అహ్మద్‌, కొడగు జిల్లా చీఫ్‌ ఇంజినీరు బీవీ జయణ్ణ, ధార్వాడ అటవీశాఖ అధికారి మహేశ్‌ చంద్రయ్య హీరేమఠ, బీదర్‌ జిల్లా ఏఈ శివకుమారస్వామి, కోలారు అసిస్టెంట్ డైరెక్టర్‌ నాగరాజప్ప, జమఖండి ఏఆర్‌టీఓ షణ్ముగప్ప, చిక్కబళ్లాపుర ఏఏఈ సదాశివయ్య, మళవళ్లి గ్రామ పంచాయతీ సహాయక అకౌంటెంట్ కృష్ణగౌడ, బెళగావి కార్యదర్శి- పీడీవో సదాశివ జయప్ప, రామనగర జిల్లా పీడీఓ యతీశ్‌ నివాసాలపై దాడులు కొనసాగాయని అధికారులు ధ్రువీకరించారు. వీరి పేరిట భారీ మొత్తంలో స్థిర, చరాస్తులు, వాణిజ్య సముదాయాలు, వాహనాలు ఉన్నాయని గుర్తించారు. బెంగళూరు, బెంగళూరు గ్రామీణం, బాగలకోట, బెళగావి, బీదర్‌, చిక్కబళ్లాపుర, ధార్వాడ, కొడగు, కోలారు, మైసూరు, రామనగర, ఉడుపి, ఉత్తర కన్నడ జిల్లాలలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. జప్తు చేసుకున్న ఆస్తుల వివరాలను అధికారులు లెక్కగడుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో వెల్లడించే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని