logo

బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత ఎన్టీఆర్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఎన్టీఆర్‌ బాటలు వేశారని నేతలు కొనియాడారు. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ 26వ వర్ధంతిని ఖమ్మంలో మంగళవారం నిర్వహించారు. పార్టీ ఖమ్మం లోక్‌సభ కమిటీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో

Published : 19 Jan 2022 05:37 IST

నివాళులర్పిస్తున్న కూరపాటి తదితరులు

ఖానాపురం హవేలి, న్యూస్‌టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఎన్టీఆర్‌ బాటలు వేశారని నేతలు కొనియాడారు. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ 26వ వర్ధంతిని ఖమ్మంలో మంగళవారం నిర్వహించారు. పార్టీ ఖమ్మం లోక్‌సభ కమిటీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేశారు. తొలుత ఎన్టీఆర్‌ భవన్‌లో ఉచిత నేత్ర, రక్తదాన శిబిరాలు ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్‌ కూడలిలో విగ్రహానికి గజమాల వేసి నివాళులు అర్పించారు. నిరుపేద వృద్ధులకు దుప్పట్లు, వస్త్రాలు పంపిణీ చేశారు. నాయకులు  హరీశ్‌, సీతయ్య, నాగేశ్వరరావు,  రంజిత్‌, నవీన్‌, విజయ్‌,  శ్రీనివాస,  తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని