logo

బాలికలు భళా

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో జిల్లా 22వస్థానంలో నిలిచింది. జిల్లా నుంచి మొత్తం 9,090 మంది బాలురు, 8,318 మంది బాలికలు కలిపి మొత్తం 17,408 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 8,092 మంది

Published : 01 Jul 2022 04:43 IST

పది పరీక్షల్లో జిల్లాకు 22వ స్థానం

పరీక్ష రాసిన విద్యార్థులు: 17,543
ఉత్తీర్ణులు: 15,803
శాతం: 90.78
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో జిల్లా 22వస్థానంలో నిలిచింది. జిల్లా నుంచి మొత్తం 9,090 మంది బాలురు, 8,318 మంది బాలికలు కలిపి మొత్తం 17,408 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 8,092 మంది బాలురు, 7,711మంది బాలికలు కలిపి మొత్తం 15,803మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 89.02 కాగా బాలికల ఉత్తీర్ణత శాతం 92.7గా ఉంది. మొత్తం మీద చూస్తే ఫలితాల్లో బాలికల హవానే కొనసాగిందని డీఈవో ఎస్‌.యాదయ్య తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు కేజీబీవీ, ఐటీడీఏ, టీటీడబ్ల్యూయూఆర్‌జేసీ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా 10జీపీఏ సాధించలేదు. ఎయిడెడ్‌ స్కూల్‌, టీఎస్‌ఆర్‌ఎస్‌, టీఎస్‌ఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌, టీఎస్‌ఎంఎస్‌ స్కూళ్లలో ఒకొక్కరు మాత్రమే 10జీపీఏ సాధించారు. మొత్తం మీద చూస్తే ప్రైవేటు పాఠశాలలు అత్యధికంగా 376 మంది విద్యార్థులు 10జీపీఏ సాధించటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని